Jasprit Bumrah : సంజనకు అహంకారం ఎక్కువ అని అనుకున్నా.. భార్య గురించి బుమ్రా షాకింగ్ కామెంట్స్
సంజనకు అహంకారం ఎక్కువ అని అనుకున్నా | టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలుసు
టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే.. బుమ్రా పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం ఆయన పెళ్లికి కొన్ని రోజుల ముందే క్రికెట్ అభిమానులకు తెలిసింది. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ను బుమ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మార్చి 15న వాళ్ల పెళ్లి గోవాలో జరగింది. వాళ్ల పెళ్లి జరిగేవరకు కూడా బుమ్రా, సంజన ప్రేమ వ్యవహారం చాలామందికి తెలియదు. అసలు.. వాళ్లిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది. వాళ్ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది. ప్రేమ.. పెళ్లి దాకా ఎలా వెళ్లింది అనే విషయం తెలియదు.
అయితే.. ఇటీవల జస్ప్రిత్ బుమ్రా… తన భార్య సంజన గురించి, తమ లవ్ గురించి ఓపెన్ అయ్యాడు. ఇటీవల దినేశ్ కార్తీక్‌తో స్కై స్పోర్ట్స్ చానెల్లో ఫ్రెండ్లీ చాట్ అనే ప్రోగ్రామ్‌లో బుమ్రా పాల్గొన్నాడు. ఆ సమయంలో.. తన వైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.
2019 వరల్డ్ కప్‌లోనే మాటలు కలిశాయి
అసలు మొదట్లో మేమిద్దరం ఒకరికొకరం మాట్లాడుకోకముందే.. మా గురించి మేమే తప్పుగా ఊహించుకున్నాం. నాకు గర్వం ఎక్కువ అని సంజన అనుకుంది. సంజనకు గర్వం ఎక్కువ అని నేను అనుకున్నా. కానీ.. ఇంగ్లండ్‌లో 2019 వరల్డ్ కప్ సమయంలో ఒకరిని మరొకరం అర్థం చేసుకోవడం ప్రారంభించాం. నేను తనను చాలా సార్లు చూసినప్పటికీ.. తారసపడినప్పటికీ.. ఇద్దరం ఏనాడూ మాట్లాడుకోలేదు. 2019 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో తను ఆ ఈవెంట్‌ను కవర్ చేయడానికి వచ్చినప్పుడే మా మధ్య మాటలు కలిశాయి. అప్పుడే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం.

అప్పటి నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత అంతా ఓకే అనిపించింది. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని కూడా 5 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం.. అంటూ బుమ్రా.. దినేశ్ కార్తీక్‌తో చెప్పాడు.
తనకు క్రికెట్ గురించి బాగా తెలుసు. ఎప్పుడు క్రికెట్ ఆటగాడు ఎలా ఉంటాడో.. వాళ్ల మూడు ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తనకు తెలుసు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నా. అందుకే.. తనను నాతో పాటే క్రికెట్ మ్యాచ్‌లకు తీసుకెళ్తున్నా.. అని బుమ్రా వెల్లడించాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ టూర్లో.. బుమ్రాతో పాటే తన వైఫ్ సంజన కూడా ఇంగ్లండ్‌కు వెళ్లింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
Teachers Day : సచిన్, బిల్‌గేట్స్ విజయం వెనుక ఉన్నది ఈ గురువులే.. వాళ్లెవరంటే
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

