Infertility : ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న సంతానలేమి సమస్య.. తప్పెవరిది?
ఇన్ఫెర్టిలిటీ.. దీన్నే మనం సంతానలేమి అంటాం. వంధ్యత్వం అని కూడా అంటారు. చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే.. సంతానలేమి సమస్య కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ.. ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఇద్దరిలోనూ ఉండొచ్చు. మగవాళ్లలోనూ… ఆడవాళ్లలోనూ ఇద్దరిలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈసమస్య ఉన్నవాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఒకప్పుడు అంటే మన తాతల కాలంలో సంతానలేమి సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. కానీ.. ఈ జనరేషన్లో సంతానలేమి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇద్దరిలో ఇప్పుడు సంతానలేమి సమస్యలు వస్తున్నాయి.

అసలు సంతానలేమికి అసలు కారణాలు ఏంటి? ఈ జనరేషన్లో సంతానలేమి సమస్యలు పెరగడానికి కారణం ఏంటి? సంతానలేమి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా నేటి యూత్ లైఫ్ స్టయిల్ లో వచ్చే మార్పులే సంతానలేమికి ప్రధాన కారణాలు. తినే తిండి, పీల్చే గాలి, జీవన విధానం, చేసే పని.. అన్నీ సంతానలేమికి కారణాలే. సాధారణంగా మహిళల్లో 35 సంవత్సరాలు నిండితే సంతాన యోగం తగ్గుతూ వస్తుంది. వాళ్లలో అండాల ఉత్పత్తి తగ్గుతుంది. మోనోపాజ్ స్టేజ్ వచ్చిందంటే ఇక సంతానం కలగదు. అదే పురుషుల్లో 50 సంవత్సరాల వరకు మాత్రమే సంతానం కలిగే యోగం ఉంటుంది. ఆ వయసు దాటితే వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
ఈ జనరేషన్లో 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోకపోవడం, వయసు మీద పడేదాక కెరీర్లో బిజీగా ఉండటం, కొందరికి సరైన పార్ట్ నర్స్ దొరక్కపోవడం లాంటి సమస్యల వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయి.
అలాగే.. ఎక్కువ పనిగంటలు, కంటిన్యూగా కూర్చొని పనిచేయడం, మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లు, ఒత్తిడికి గురవడం, డిప్రెషన్, వ్యాయామం చేయకపోవడం, పౌష్ఠికాహారం తీసుకోకుండా ఏది పడితే అది తినడం లాంటి అలవాట్ల వల్ల.. మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది. ఆడవాళ్లలో అయితే.. అండాల ఉత్పత్తి సరిగ్గా జరగడం లేదు.
ఒక్కోసారి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గులు, ఇతర లైంగిక సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఎక్కువ యూత్.. అన్ హెల్తీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడటమే… సంతానలేమి సమస్యలకు మూలకారణం. అందుకే.. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టయిల్ తో… చెడు అలవాట్లకు దూరంగా ఉంటే.. సంతానలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

