LIC Death Insurance Claim : ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోతే.. ఇన్సురెన్స్ డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
LIC Death Insurance Claim : ఎల్ఐసీ పాలసీని ఈరోజుల్లో అందరూ తీసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరిగేది తెలియని ఈ జనరేషన్లో తమ ఫ్యామిలీ కోసం ఎల్ఐసీని కడుతున్నారు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో దురదృష్టవశాత్తు ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోతే ఏం చేయాలి? ఇన్సురెన్స్ డబ్బులను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? నామినీ మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలా? వేరే ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందా? అసలు దానికి ప్రొసీజర్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోతే.. ఆ పాలసీదారుడు ఎవరి పేరు అయితే నామినీగా ఇస్తారో వాళ్లు మాత్రమే ఆ ఎల్ఐసీ డబ్బులను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎల్ఐసీ డెత్ క్లెయిమ్‌ను పూర్తిగా ఆఫ్ లైన్లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఎల్ఐసీ కల్పించింది.
ముందు ఎల్ఐసీ పాలసీ కట్టిన హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు కనుక్కోవాలి. దాని కంటే ముందు.. పాలసీ తీసుకున్న పాలసీదారు ఏజెంట్ లేదా ఆ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్‌తో సంతకం పెట్టించుకొని అప్పుడు ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
LIC Death Insurance Claim : దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే
ముందు ఎల్ఐసీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి.. పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని బ్రాంచ్ మేనేజర్‌కు వెల్లడించాలి. అప్పుడు బ్రాంచ్ అధికారులు.. ఫామ్ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌లను ఇస్తారు.
ఆ ఫామ్‌లను నింపిన తర్వాత వాటితో పాటు పాలసీదారుడి ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డు జిరాక్స్, చనిపోయిన పాలసీదారుడి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని.. అన్నింటి మీద నామినీ సంతకం పెట్టి.. ఎల్ఐసీ అధికారులు ఇచ్చిన ఫామ్‌లతో పాటు వీటిని కూడా ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది.
అలాగే.. ఒక ఇంటిమేషన్ లెటర్‌ను నామినీ సమర్పించాల్సి ఉంటుంది. అందులో పాలసీదారుడు చనిపోయిన తేదీ, చనిపోయిన ప్రాంతం, చనిపోయిన కారణం లాంటి వివరాలతో ఆ లెటర్ ఉండాలి. ఆఫీసు అధికారులు ఇచ్చిన నెఫ్ట్ ఫామ్‌లో నామినీ బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చి.. అదే బ్యాంకుకు సంబంధించిన క్యాన్సిల్ చెక్, బ్యాంక్ పాస్ బుక్‌ను సమర్పించాలి. బ్యాంక్ పాస్‌బుక్‌లో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ కనిపించేలా ఉండాలి.
ఆఫీసులో డాక్యుమెంట్లను సమర్పించే సమయంలో.. నామినీ, పాలసీదారుడికి సంబంధించిన ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలి. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ కార్డులను అధికారులు చెక్ చేస్తారు. బ్యాంక్ ఒరిజినల్ పాస్ బుక్‌ను కూడా అధికారులు చెక్ చేశాక.. అప్పుడు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. నామినీ.. డాక్యుమెంట్లను సబ్మిట్ చేశాక.. అధికారులు ఇచ్చే రిసీప్ట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. భవిష్యత్తులో డెత్ క్లెయిమ్‌కు సంబంధించి అదే ప్రూప్‌గా ఉపయోగపడుతుంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

