Women’s Day Celebrations | డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
Women's Day Celebrations | అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (జి.టి.ఎ) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ముఖ్య ముఖ్య అతిథిగా భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ హాజరయ్యారు.
Women’s Day Celebrations | అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (జి.టి.ఎ) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ముఖ్య ముఖ్య అతిథిగా భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందిస్తున్న ఎనలేని సేవలను, కనబరుస్తున్న విశేష ప్రతిభా పాటవాలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని సూచించారు.
ఈ వేడుకలకు ముఖ్య వక్త గా విచ్చేసిన ప్రొఫెసర్ పద్మజ నందిగామ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మ పదుకొనే, సుమ కల్వల మాట్లాడుతూ.. అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ సంఘం వనితా బృందాలు రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

Women’s Day Celebrations 1
ఈ కార్యక్రమానికి సహకరించిన సుష్మ పదుకొనే, సుమ కల్వల, స్వప్న చింతపల్లి, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఎ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది. డెట్రాయిట్లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

Women’s Day Celebrations
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

