Singapore | సింగపూర్‌లో శోభాయమానంగా ఉగాది ప్రత్యేక పూజలు..
సింగపూర్‌లో (Singapore) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం జరిపించారు.
హైదరాబాద్: సింగపూర్‌లో (Singapore) శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవం జరిపించారు. సుప్రభాతసేవతోపాటు తోమాలసేవ, అభిషేకం, సహస్ర నామార్చన, విశేష పూజలతో పాటు మహాలక్ష్మి, విష్ణుదుర్గ అమ్మవార్లకు, ఆంజనేయ స్వామికి అభిషేకం మొదలగు విశేష కైంకర్యాలు నిర్వహించారు. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు మరుసటి రోజే ఉగాది రావటం విశేషం. కళ్యాణోత్సవం తరవాత శ్రీవారు ఆస్థానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. సింగపూర్ తెలుగు సమాజం స్వర్ణోత్సవాలు మే 11 న జరుగనున్నట్లు ప్రకటించి, అందరి సహాయ సహకారాలు కోరారు.

కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన తిరుమల లడ్డూ ప్రసాదం, తిరుమల కళ్యాణ తలంబ్రాలు, ఇతర మంగళ ద్రవ్యాలతోపాటు కార్యక్రమానికి గుర్తుగా ఒక జ్ఞాపికను అందిస్తామని కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి తెలిపారు.

అలానే సింగపూర్‌లో అరుదుగా లభించే వేప పువ్వు స్ధానిక తెలుగు వారికి ఉచితంగా అందించామన్నారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసిన ఉగాది పచ్చడిని అందరికీ పంచామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని, ఉదయం నుంచి సుమారు 5 వేల మంది భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యారని చెప్పారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.

కాగా, కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గానికి, అర్చకులకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు, భక్తులు, పంచాంగ పఠనం చేసిన పండితులు, సేవాదళ సభ్యులు, కార్యక్రమానికి హాజరై, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అందరికీ అనిల్ పోలిశెట్టి ధన్యవాదములు తెలియజేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

