TS Minister KTR | అమెరికాలో న్యూజెర్సీలో గల `హోప్ 4 స్పందన` అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కేటీ రామారావు బర్త్డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా హోప్ 4 స్పందన సహకారంతో టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 10 మంది వికలాంగులకు చేయూతనిచ్చారు.
ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేసుకున్నారు. నాటి నుంచి సిరిసిల్ల పట్టణాభివృద్ధి కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, అదే స్థాయిలో రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్కు మహేశ్ బిగాల జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీవీ వాణిదేవి, సినీ నటి అనసూయ తదితరులు పాల్గొన్నారు.