Suicide | ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
Suicide | ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా (USA) లో కర్నూలు యువకుడు చందు (Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలచివేస్తోంది.
Suicide : ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా (USA) లో కర్నూలు యువకుడు చందు (Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతోంది. 26 ఏళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలచివేస్తోంది. కాగా కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ 2.0 (Donald Trump 2.0) ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులు, హెచ్-1బి వీసా నిబంధనల మార్పుల వల్ల కొత్తగా చదువు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు రావడం సవాలుగా మారింది.
చందు కూడా గత కొంతకాలంగా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఖర్చుల కోసం మళ్ళీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోందన్న భావన అతనిని మరింత కుంగదీసింది. ఆ ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన తట్టుకోలేక ఏప్రిల్ 28న తన గదిలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందు మరణవార్తతో అతని స్వస్థలం కర్నూలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. తానా టీమ్ స్క్వేర్ కో-చైర్ చిరంజీవి గల్లా, ఇతర ప్రవాస తెలుగు సంఘాలు చందు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Chandu
- Suicide
- Telugu youth
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

