Diwali Gifts | భారత సంతతి సింగపూర్ పౌరులకు సిండా దీపావళి కానుకల పంపిణీ..
Diwali Gifts | సింగపూర్ లో ఆర్థికంగా వెనుకబడిన భారత సంతతి కుటుంబాలకు సింగపూర్ పౌరులకు సిండా (SINDA), తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు దీపావళి కానుకలు పంపిణీ చేశారు
Diwali Gifts | సింగపూర్లో భారత్ మూలాలు కలిగి ఉండటంతోపాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న సింగపూర్ పౌరులకు సిండా (SINDA), తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు దీపావళి కానుకలు పంపిణీ చేశారు. సిండా (SINDA) అంటే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్. సిండా తరఫున దీపావళి గూడీ బ్యాగ్లను సింగపూర్లో పంపిణీ చేశారు. భారత్ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా ప్రతినిధులు ప్రతి ఏటా దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తున్నారు. ఇందులో బాగంగా ఈ ఏడాది దీపావళి అలంకరణ సామాగ్రితోపాటు కొన్ని తినుబండారాలు, పండుగ ఖర్చుల కోసం 120 డాలర్లు అందజేసింది.
అయితే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) పిలుపు మేరకు ఈ నెల ఐదో తేదీ నుంచి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రి ని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమం లో స్వచ్ఛందంగా పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందనీయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

