Sankara Nethralaya | ఘనంగా శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్
Sankara Nethralaya | శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడో వార్షిక 5K వాక్ నిర్వహించారు. శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారిని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది.
Sankara Nethralaya | శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడో వార్షిక 5K వాక్ నిర్వహించారు. నోవై నగరంలోని ఐటీసీ స్పోర్ట్స్లో ఆదివారం ( సెప్టెంబర్ 14న) నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి; చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నేత్ర శిబిరాల కార్యక్రమాలు, శంకర నేత్రాలయ కు సంబంధించిన వివిధ గణాంకాలు అలాగే శంకర నేత్రాలయ ఏ విధంగా తమ నేత్ర శిబిరాలతో ఉచిత సౌకర్యాలతో భారత దేశంలో నిర్వహిస్తున్న నేత్ర చికిత్సల గురించి వివరించే విధంగా బోర్డులు ప్రదర్శించారు. శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారిని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5K వాక్ లో పాల్గొన్నారు.

శంకర నేత్రాలయను 1978 లో పద్మభూషణ్ డాక్టర్ ఎస్ బద్రీనాథ్ గారు స్థాపించారు. పేదలకు నేత్ర చికిత్సలు, నేత్ర సంబంధిత వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ USA ఫౌండర్ ఎస్వీ ఆచార్య.. డెట్రాయిట్ చాప్టర్ బృందానికి తమ అభినందనలు తెలిపారు. శంకర నేత్రాలయ USA ప్రెసిడెంటు బాల రెడ్డి ఇందుర్తి, కార్యదర్శి వంశీకృష్ణ ఎరువారం, కోశాధికారి మూర్తి రేకపళ్ళి, స్పోర్ట్సు కమిటి చైర్ రమేశ్ చాపరాల, వాలింటరి కమిటీ చైర్ రత్నకుమర్ కవుటూరు తమ సహాయ సహకారాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి కార్యక్రమం ఉద్దేశాన్ని, శంకర నేత్రాలయ కార్యక్రమాలను వివరించారు. సాయి గోపిశెట్టి 5K వాక్ ఉద్దేశాన్ని, వివరాలను సభ్యులకి తెలియజేశారు. 5K వాక్ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తూ డొనేషన్లు అందజేశారు. అందరూ తమ వంతు ప్రయత్నంగా తమ స్నేహితులకు శంకర నేత్రాలయ ఆర్గనైజేషన్ గురించి వివరిస్తామని అందరికీ తెలిసేలా పాటుపడతామని తెలిపారు.

పలువురు స్పాన్సర్లు కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ఆర్ధిక సహాయం అందించారు. (రెస్టౌరెంట్ రావుగారి విందు, శ్వీట్ టైంస్, SPARC, మెగాస్టార్ ఫాన్స్, ప్రసాద్ కాట్రగడ్డ , శ్రీదేవి గోగినేని). నోవై హైస్కూల్ విద్యార్థులు పలుమంది ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా పనిచేశారు. తర్వాత ఈ 5K వాక్ లో రెండు క్యాటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు దాతల చేత ప్రైజ్లు అందింపజేశారు. శంకర నేత్రాలయ గురించి వివరాలు వారి వెబ్ సైట్ sankaranethralayausa.org నుంచి తెలుసుకోవలసిందిగా కోరారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

