దమ్ముంటే అభివృద్ధి ఛాలెంజ్ స్వీకరించు.. రేవంత్‌కు ఎన్నారైలు సవాల్
దమ్ముంటే అభివృద్ధి (Development) ఛాలెంజ్ స్వీకరించు.. రేవంత్ రెడ్డి అని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.

లండన్ : తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న మంత్రి కేటీఆర్‌పై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును టీఆర్ఎస్ ఎస్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తప్పుబట్టారు. వైట్, బ్లాక్ ఛాలెంజ్ కాదని.. రేవంత్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే అభివృద్ధి (Development) ఛాలెంజ్‌ను స్వీకరించాలని సవాల్ విసిరారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన విమర్శలను ఎన్నారై శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన నాయకుడని అన్నారు.
మంత్రి కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ఇన్నేండ్లు ఏం చేశావో ప్రజలకు చెప్పాలని అనిల్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. బాధ్యతగల స్థానంలో ఉండి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎంత సేపు వ్యక్తిగత దూషణలతో ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యాడని అన్నారు. ఈ ధోరణిని ఎన్నారైలు సైతం అసహ్యించుకుంటున్నారని అనిల్ తెలిపారు.
ఇప్పటికైనా రేవంత్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇలాగే మంత్రుల మీద, నాయకుల మీద పిచ్చి విమర్శలు చేస్తే తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సత్య నాదెళ్ల ఎవరో కూడా తెలియని జ్ఞానం లేని చరిత్ర నీది, కానీ అదే సత్య నాదెళ్లతో ప్రశంసలందుకున్న చరిత్ర మంత్రి కేటీఆర్‌దని, ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. ఎవరి స్థాయి ఏందో ప్రజలకు తెలవడానికి ఇది చాలన్నారు. పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవని ప్రపంచానికి తెలువదా అన్ని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

