NRI | ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గం ఎన్నిక
NRI | ఎన్నారై(NRI) బీఆర్ఎస్ యూకే (BRS UK)నూతన కార్యవర్గాన్ని ఎన్నారై బీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సంయుక్తంగా ప్రకటించారు.
లండన్ : ఎన్నారై(NRI) బీఆర్ఎస్ యూకే (BRS UK)నూతన కార్యవర్గాన్ని ఎన్నారై బీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..అనిల్ కూర్మాచలం నేతృత్వంలో మొట్టమెదటగా బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. గత 14 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
నేడు ప్రతిపక్షపాత్రను కూడా ఎన్నారై బీఆర్ఎస్ యూకే సమర్థవంతంగా పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి గత 6 సంవత్సరాలుగా యూకేలో పార్టీకి ఎంతో సేవ చేశారు. అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అభినందించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెపారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి స్పందించి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చెయ్యాలని అనిల్ కూర్మాచలం సూచించారు.
నూతన కార్యవర్గం ఇదే..
అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరి నవాపేట్, గొట్టిముక్కుల సతీష్ రెడ్డి , సత్యమూర్తి చిలుముల, రవి కుమార్ రేటినేని, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్ కడుదుల,అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా సీక చంద్ర శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్లుగా శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులుగా దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వీర మధుసూదన్ రెడ్డి, సేరు సంజయ్ నియమితులయ్యారు.
కార్యదర్శులుగా సతీష్ రెడ్డి బండ, సురేష్ గోపతి, మల్లా రెడ్డి, అబ్దుల్ జాఫర్, శివ కుమార్ గౌడ్ చలపురం, కార్యదర్శి – ఐటీ, మీడియా అండ్ పీఆర్‌గా రవి ప్రదీప్ పులుసు, కోశాధికారిగా సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్‌గా రమేష్ ఇస్సంపల్లి ఎన్నికయ్యారు. కమ్యూనిటీ అఫైర్స్ వైస్ చైర్మన్లుగా శ్రీధర్ రావు తక్కలపల్లి , గణేష్ పాస్తం, లండన్ ఇంచార్జిగా సత్యపాల్ రెడ్డి పింగళి, సంయుక్త కార్యదర్శులుగా నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని,
రామకృష్ణ కలకుంట్ల , యూత్ వింగ్ కార్యదర్శిగా ప్రశాంత్ మామిడాల, శ్రావణ్ ముద్దుబిడ్డ, అధికార ప్రతినిధులుగా రవి ప్రదీప్ పులుసు, రవి కుమార్ రేటినేని, రమేష్ ఇస్సంపల్లి, గణేష్ కుప్పాల, సురేష్ గోపతి, సాయి బాబా కోట్ల, సతీష్ రెడ్డి బండ, అబ్దుల్ జాఫర్, సోషల్ మీడియా కన్వీనర్స్‌గా సత్యమూర్తి చిలుముల, రవి ప్రదీప్ పులుసు, సాయి బాబా కోట్ల, అంజన్ రావు, రమేష్ కట్టా, మెంబర్షిప్ కో ఆర్డినేటర్‌గా అంజన్ రావు, రీజినల్ ఇంచార్జిగా రాజేష్ వర్మ (మిల్టన్ కీన్స్), సతీష్ రెడ్డి బండ (రీడింగ్), శివ గౌడ్ (లీడ్స్) , రమేష్ కట్ట (కోవెంట్రీ), నార్త్ ఐర్లాండ్ ఇంచార్జీగా సాయి బాబా కోట్ల, ఈవెంట్స్ ఇంచార్జిగా తరుణ్ లునావత్, ఇస్మాయిల్ (అబ్బు) ఎన్నికయ్యారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

