Rishi Sunak | రిషి సునాక్‌కు నో.. లిజ్ ట్రస్ బెటరంటున్న టోరీలు!
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్‌కు 61 % మంది టోరీలు మద్దతిస్తుంటే.. కేవలం 39% మాత్రమే రిషి సునాక్‌కు మద్దతు ఇస్తున్నారు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ వెనకబడ్డారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు- దేశ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆధిక్యంలో ఉన్నట్లు ఒపీనియమ్ అనే సంస్థ నిర్వహించిన సర్వే పేర్కొంది. 61 శాతం మంది లిజ్ ట్రస్‌కు ఓటేస్తే, కేవలం 39 శాతం మంది మాత్రమే రిషి సునాక్‌కు అనుకూలమని చెప్పారు. ఈ సర్వే వివరాలు `ది అబ్జర్వర్` పత్రికలో ప్రచురితం అయ్యాయి. సుమారు 22 అంశాలపై అడిగిన ప్రశ్నల్లో టోరీ పార్టీ సభ్యులు సగం మందికి పైగా లిజ్ ట్రస్ అభిప్రాయానికే మద్దతు ఇచ్చారు.
లిజ్ ట్రస్ ఆధిక్యంలో కొనసాగుతున్నా.. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యేందుకు రిషి సునాక్‌కు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్లు లిజ్ ట్రస్‌కు మద్దతు ఇస్తున్నారు. యువతరం మాత్రం రిషి సునాక్‌కు అనుకూలంగా ఉన్నారని తెలుస్తున్నది. ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను రాజీనామా చేయాల్సిందేనని రిషి సునాక్ కోరడమే ఆయనకు ప్రతికూలంగా మారిందని సమాచారం. బోరిస్ జాన్సన్‌కు సన్నిహితులుగా భావిస్తున్న లిజ్ ట్రస్.. ఆయన్ను రాజీనామా చేయాలని కోరకపోవడమే ఆమెకు కలిసి వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చేనెల రెండో తేదీ వరకు కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకోవడానికి గడువు ఉంది. ఆ లోగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్లైన్లో గానీ, పోస్టల్ ద్వారా గానీ తమ ఓట్లు వేయాల్సి ఉంటుంది. వచ్చే నెల ఐదో తేదీన ఫలితాలు వెలువడతాయి. అదే రోజు కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా గెలిచిన అభ్యర్థే దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. లిజ్ ట్రస్‌తో పోలిస్తే బాగా వెనకబడ్డ రిషి సునాక్.. వచ్చే మూడు వారాల్లో మద్దతు పుంజుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

