కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు
Canada | కెనడాలోని టోరంటో నగరంలోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టొరంటో సిటీ కౌన్సిలర్ గేరి క్రాఫోర్డ్, ఆయన సతీమణి హాజరయ్యారు.
Canada | కెనడాలోని టోరంటో నగరంలోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టొరంటో సిటీ కౌన్సిలర్ గేరి క్రాఫోర్డ్, ఆయన సతీమణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ.. కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ అని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలెన్నో జరుపుకోవాలని, కెనడాలోని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు.

120 మంది వాలంటీర్లతో,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథుల సమక్షంలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. అతిథులందరికీ తెలుగు వంటకాలైన 14 రకాల ఐటమ్స్‌తో వడ్డించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒరియా భాషల్లో పాటలు, డ్యాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు.

ఈ సందర్భంగా అతిథులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల, సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈకార్యక్రమం విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ చాలా సహకరించారు.

దీనా రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీంద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యంతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరగా సూర్య కొండేటి మాట్లాడుతూ.. 120 మంది వాలంటీర్లు రాత్రి ప్రగలు శ్రమించి దీపావళి ఈవెంట్‌ను ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

