భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సిలికానాంధ్ర సంపద’ – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు
ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy) అనే సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం 2000 మంది విద్యార్ధుల పరీక్షలు నిర్వహిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
26 మార్చి2022 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాలం ద్వారా, దాదాపు 650 మంది కి పైగా విద్యార్ధులకు జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరొక 1300 మంది విద్యార్ధులకు ఏప్రిల్ 9న లెవెల్ 1 మరియు లెవెల్ 3 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్ధులు ఎవరూ తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక సహాయంతో సునాయాసంగా మరియు పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు,తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, జయమాధవి పునుగుపాటి, తెలుగు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా. భట్టు రమేష్ గారు,పరీక్షల నియంత్రణ అధికారి డా. మురళీ కృష్ణ, అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణాధికారి డా. రెడ్డి శ్యామల గారి పర్యవేక్షణలో, అధికారుల బృంద సభ్యులైన డా. హనుమంతరావ్ కోట్ల, డా. పద్మప్రియ, డా. శ్రీనివాసాచారి, నృత్య విబాగం అధిపతి డా. వనజ ఉదయ్, సంగీత విభాగం అధిపతి డా. రాధ సారంగపాణి గార్ల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ పరీక్షలు నిర్వహణను ముందుండి దిశా నిర్దేశం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డా. తంగెడ కిషన్ రావ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

