BRS USA | ఆఫీసులపై దాడులు చేయించడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం : బీఆర్ఎస్ యూఎస్ఏ
BRS USA | ప్రెస్ మీట్ పెట్టడం ప్రజాస్వామ్య హక్కు. విమర్శకు ప్రతివిమర్శతో సమాధానం చెప్పాలి కానీ, గూండాలను పంపించి ఆఫీసులపై దాడులు చేయించడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు బీఆర్ఎస్ యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొంకాల .
BRS USA | కరీంనగర్ పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై జరిగిన దాడిని BRS USA డివిజన్ తీవ్రంగా ఖండిస్తున్నదని బీఆర్ఎస్ యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొంకాల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం ప్రజాస్వామ్య హక్కు. విమర్శకు ప్రతివిమర్శతో సమాధానం చెప్పాలి కానీ, గూండాలను పంపించి ఆఫీసులపై దాడులు చేయించడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు.
వార్తా నివేదికల ప్రకారం బీజేపీ కార్యకర్తలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్లి వాహనాల అద్దాలు ధ్వంసం చేసి ఆఫీస్ ఆస్తులకు నష్టం కలిగించినట్లు పేర్కొన్నాయి. గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం చూసిన కరీంనగర్ నేలపై ఇలాంటి నీచమైన దాడులు ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ రోజు అధికార అహంకారంతో బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని వీధి రాజకీయాల స్థాయికి దించారు.
బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ప్రజలను రక్షించాలి. కానీ మీ అనుచరులు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయడం ఎంతవరకు సమంజసం..? ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. అద్దాలు పగలగొట్టడం, కార్లపై దాడి చేయడం నాయకత్వం కాదు..అది బరితెగింపు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై, పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేసిన బీజేపీ అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని BRS USA డివిజన్ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ దాడులకు ప్రేరేపించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, సాన్ ఆంటోనియో, సాన్ డియాగో, కనెక్టికట్, బోస్టన్, కొలంబస్, డెలావేర్, వర్జీనియా తదితర నగరాల BRS USA సభ్యులు ఈ దాడిని ఏకగ్రీవంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాటకు మాటే సమాధానం.. దాడి కాదు. తెలంగాణ గౌరవాన్ని తాకితే బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకోవని హెచ్చరించారు.
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

