BRS South Africa | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో పేదలకు బ్లాంకెట్ల పంపిణీ
BRS South Africa | బీఆర్ఎస్(BRS) పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ( BRS South Africa) ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్ల(Blankets)ను పంపిణీ చేశారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ( BRS South Africa) ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్ల(Blankets)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెండా పండుగను నిర్వహించారు. సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 27 న స్వేచ్ఛ , ఐక్యత యొక్క శక్తిని జరుపుకునే రెండు ముఖ్యమైన సంఘటనలు చరిత్రలో జరిగాయని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా(Nelson Mandela) ఆధ్వర్యంలో 1994లో ఆ దేశానికి స్వేచ్ఛా, ప్రజాస్వామ్యం వచ్చిందన్నారు. తెలంగాణలో 2001 లో ఇదే రోజున, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అంకురార్పరణ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో తెలంగాణ ఏర్పడి రాష్ట్రానికి కొత్త గుర్తింపు, గర్వాన్ని తెచ్చిపెట్టిందని వెల్లడించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సమీప పోలీస్ స్టేషన్ విక్టిమ్ ఎంపవర్మెంట్ సెంటర్ లో దుప్పట్లు పంపిణీ చేశారు. వారి ద్వారా పేదలకు ప్రతి సంవత్సరం శీతాకాలములో దుప్పట్ల పంపిణీ జరుగుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కమిటీ సభ్యులు మేడసాని నరేందర్ రెడ్డి ,అరవింద్ చీకోటి, నవదీప్ రెడ్డి గుడిపాటి, సౌజన్ రావు, ఉమా మేహేశ్వర్ కుంట, రమణ అంతటి , హరిక్రిష్ణ వెంగల , రాకేష్ మోతూకూరి పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

