NRI News | కీలక పదవిలో భారత సంతతి మహిళను నియమించిన బైడెన్
NRI News | అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారని వైట్ హౌస్ తెలిపింది.
NRI News | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్ సంతతికి చెందిన మహిళను కీలక పదవిలో నియమించారని వైట్ హౌస్ గురువారం ప్రకటించింది. అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యాను బైడెన్ నియమించారని వైట్ హౌస్ తెలిపింది. ఆమెతోపాటు పలు నియామకాలు చేపట్టారని వెల్లడించింది. స్టేడ్ వైడ్ డెలావేర్ లా ఫర్మ్ సహ-యజమానిగా శకుంతల ఎల్ భయ్యా ఉన్నారు. గత ఏడేండ్లుగా ఆమె గవర్నర్ కార్నేయ్ జ్యుడీషియల్ నామినేటింగ్ కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. న్యాయవాద వ్రుత్తితోపాటు డెలావేర్ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించారు.
అమెరికన్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ సభ్యురాలిగా పని చేశారు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ హక్కుల పరిరక్షణ, వారి పిల్లల దత్తత, పని ప్రదేశాల్లో వివక్షపై పోరాడారు. డెలావేర్ బార్ అసోసియేషన్‌లో తొలి దక్షిణాసియా భారత్ మహిళగా ఉన్నారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ లా లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాయవాదిగా డైవర్సిటీ, సమానత్వం కోసం పోరాడుతూనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

