Singapore-Bathukamma | సింగపూర్‌లో అంబరాన్నంటిన తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు..!
Singapore-Bathukamma | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
Singapore-Bathukamma | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పితృ అమావాస్యనాడు ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు కొనసాగి, చివర్లో సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో, మహిళలు పూలనే గౌరమ్మగా పేర్చి రోజుకో బతుకమ్మగా పూజించి ఆశీస్సులు పొందడం సంప్రదాయం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడచులు, పిల్లలు, పెద్దలు హాజరయ్యారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను మధ్యలో ఉంచి, అందరూ కలిసి వలయాకారంలో జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి ఈ వేడుకను మరింత రంగరించారు. ఈ సందర్భంగా సింగపూర్ స్థానికులు కూడా వేడుకను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని, దాని విశిష్టతను వివరించారు. ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ, సింగపూర్ లో కూడా ఈ సంబరం నిర్వహించడం వల్ల తెలుగువారంతా ఒక్కటైనట్లు అనిపిస్తోందని అన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.

కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆర్ఆర్హెచ్సీ , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా బతుకమ్మల అందం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు, అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రధానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించామన్నారు.

గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి కార్యక్రమానంతరం కుంభకర్ణ, మిస్టర్ బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రా కర్రీ, బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాల మాధ్యమాల ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి, ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

