THDC India Limited Recruitment 2023 | ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలలో.. ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 181
పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainee)
విభాగాలు : ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 27 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.29.000 నుంచి రూ.1.9లక్షలు
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 30
వెబ్సైట్ : https://www.thdc.co.in