SBI Recruitment 2023 | డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 5,447 పోస్టులు.. దరఖాస్తులకు ఇంకా రెండు రోజులే గడువు
SBI Jobs | డిగ్రీ పాసైన నిరుద్యోగులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిరుద్యోగులకు తీపి కబురందించింది.
SBI CBO Notification 2023 | ఎస్బీఐకు చెందిన వివిధ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,447 సీబీవో పోస్టులను ఎస్బీఐ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం, బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌ల్లో పని చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 11 నుంచి ప్రారంభంకాగా.. ఈ డిసెంబర్ 17తో గడువు ముగియనుంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో 425 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్బీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది.
మొత్తం పోస్టులు : 5,447
పోస్టులు : సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో)
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం, బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
పే స్కేల్ : రూ.36,000 – రూ.63,840 వరకు
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 17
దరఖాస్తు ఫీజు : రూ. 750. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఆన్లైన్ పరీక్ష తేదీ: 2024 జనవరి నెలలో ఉంటుంది.
వెబ్సైట్: www.sbi.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

