Salar Jung Museum Recruitment 2023 | స్టెనోగ్రాఫర్ (Stenographer), గైడ్ లెక్చరర్, ఎల్డీసీ, ఎంటీఎస్, బుక్ బైండర్, సూపర్వైజర్ (Supervisor) కమ్ ఓవర్సీర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉండగా.. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: స్టెనోగ్రాఫర్, గైడ్ లెక్చరర్, ఎల్డీసీ, ఎంటీఎస్, బుక్ బైండర్, సూపర్వైజర్ కమ్ ఓవర్సీర్ తదితరాలు
అర్హతలు : పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 15
వెబ్సైట్: www.salarjungmuseum.in