NMDC Recruitment | హైదరాబాద్ ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు
NMDC Recruitment | కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (Executive Trainee) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
NMDC Recruitment | కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (Executive Trainee) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మెకానికల్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 17 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీచేస్తున్నది. షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 42
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2022 అర్హత సాధించి ఉండాలి. అదేవిధంగా సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.50000
దరఖాస్తు ఫీజు: రూ.500.
అప్లికేషన్లకు చివరితేదీ: జూలై 17
వెబ్సైట్: www.nmdc.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

