NIT Hamirpur Recruitment | సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమిర్పూర్(Hamirpur)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ (Screening Test), షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ (Trade Test), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 84
పోస్టులు : సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.21700 నుంచి రూ.209200 వరకు
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 10
వెబ్సైట్ : https://nith.ac.in