Job news | న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో ఆఫీసర్ పోస్టులు
న్యూ ఇండియా అస్యూరెన్స్| ప్రభుత్వరంగ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్కేల్ 1 కేడర్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఏడాది పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.
మొత్తం పోస్టులు: 300
ఇందులో జనర్ 121, ఈడబ్ల్యూఎస్ 30, ఓసీసీ 81, ఎస్సీ 46, ఎస్టీ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవాలి. అభ్యర్థులు 2021, ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 నుంచి 30 ఏండ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ పరీక్ష రెండు విధాలు ఉంటుంది. ఫేజ్-1లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, ఫేజ్-2లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 1
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 21
ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష: అక్టోబర్‌లో
ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష: నవంబర్‌లో
వెబ్సైట్: https://www.newindia.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

