SBI, NCERT Recruitment | నేడే చివరి గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది.
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. SBI Recruitment | ఎస్బీఐలో 217 పోస్టులు
SBI SO Recruitment 2023 | మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వీపీ, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 217 పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 217
పోస్టులు : మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వీపీ, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల
ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 19
ఆన్లైన్ పరీక్ష తేదీ: జూన్ 2023
వెబ్సైట్ : @www.sbi.co.in/careers
2. NCERT: ఎన్సీఈఆర్టీలో 347 నాన్ టీచింగ్ పోస్టులు
NCERT Recruitment 2023 | సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 347
పోస్టులు : ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
అర్హతలు : పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 27-50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : కాంపిటేటివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1500.
చివరి తేది: మే 19
వెబ్సైట్ : www.ncert.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

