Job news: హెచ్యూఆరెల్లో 513 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
జూనియర్ అసిస్టెంట్| ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆరెల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆరెల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 16 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 513 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
హెచ్యూఆరెల్ను దేశంలోని అగ్రశ్రేణి సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నెలకొల్పాయి.
మొత్తం ఖాళీలు: 513
ఇందులో జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ సివిల్ 39, మెకానికల్ 21, ఎలక్ట్రికల్ 15, ఇన్స్ట్రుమెంటేషన్ 15, అమ్మోనియా 30, ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్ 15, ఎలక్ట్రికల్ 21, ఇన్స్ట్రుమెంటేషన్ 24, ఇంజినీర్ అసిస్టెంట్ యూరియా 15, అమ్మోనియా 45, ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్ 30, ఎలక్ట్రికల్ 18, ఇన్స్ట్రుమెంటేషన్ 24, స్టోర్ అసిస్టెంట్ 9, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 12, యూరియా ప్రోడక్ట్ హాండ్లింగ్ 30, ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ 36, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ ఇన్స్పెక్షన్ 12 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 40/45 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
వెబ్సైట్: www.hurl.net.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- CIL
- Engineer Assistant
- FCIL
- HURL
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

