JIPMER Recruitment 2023 | అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర విభాగాలలో 122 సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior resident posts) భర్తీకి పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 122
పోస్టులు : సీనియర్ రెసిడెంట్
విభాగాలు : అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : సీబీటీ, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : జూలై 31 నాటికి 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 19
వెబ్సైట్ : https://jipmer.edu.in/
అడ్రస్ : XQ2X+4VC జిప్మర్ క్యాంపస్ రోడ్, జిప్మర్ క్యాంపస్, ధన్వంతరి నగర్, పుదుచ్చేరి, 605006