Job news | IOCLలో 1900 ట్రేడ్ అప్రెంటిస్‌లు
IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలలో ట్రేడ్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలలో ట్రేడ్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1900 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైనవారు గువాహటి, బరౌనీ, గుజరాత్, హల్దియా, మథురా, పీఆర్పీసీ, పానిపట్, దిగ్బాయ్, బంగైగావ్, పారదీప్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1900
ఇందులో ఆపరేటర్ అటెండెంట్ 488, మెకానికల్ 205, మెకానికల్ (బాయిలర్) 80, మెకానికల్ 236, కెమికల్ 362, ఎలక్ట్రికల్ 285, ఇన్స్ట్రుమెంటేషన్ 117, అకౌంటెంట్ 31, సెక్రటేరియల్ అసిస్టెంట్ 63, డాటా ఎంట్రీ ఆపరేటర్ 94 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: బీఎస్సీ, ఐటీఐ, బీకామ్, పదో తరగతి పాసై అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 22
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 12
అడ్మిట్ కార్డుల విడుదల: నవంబర్ 16 నుంచి
రాత పరీక్ష: నవంబర్ 21
వెబ్సైట్: www.iocl.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- IOCL
- Refinery
- Trade Apprentice
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

