న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అప్రెటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్కెటింగ్ డివిజన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగంలో మొత్తం 570 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 570
ఇందులో టెక్నికల్ అప్రెంటిస్లు 338, నాన్ టెక్నికల్.. అకౌంటెంట్ 200, రిటైల్ సేల్స్ అసోసియేట్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: www.iocl.com