IBPS Clerk 2023 Notification | ఐబీపీఎస్‌లో 4545 క్లర్క్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
IBPS Clerk 2023 Notification | 2023 సంవత్సరానికి గానూ క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా.. జులై 28 వరకు పొడిగిస్తూ.. ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది.
IBPS Clerk 2023 Notification | 2023 సంవత్సరానికి గానూ క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా.. జులై 28 వరకు పొడిగిస్తూ.. ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 4545
పోస్టులు : క్లర్క్ పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-28 ఏండ్ల మధ్య ఉండాలి.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు.
ఎంపిక : రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : జులై 28
దరఖాస్తు ఫీజు : రూ. 850. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 175)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబరు, 2023లో ఉంటుంది.
వెబ్సైట్: https://www.ibps.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

