IBPS Clerk 2023 Notification | డిగ్రీ అర్హతతో.. ఐబీపీఎస్‌లో 4045 క్లర్క్ పోస్టులు
IBPS Clerk 2023 Notification | 2023 సంవత్సరానికి గానూ క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPS Clerk 2023 Notification | 2023 సంవత్సరానికి గానూ క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జులై 21 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 4045
పోస్టులు : క్లర్క్ పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-28 ఏండ్ల మధ్య ఉండాలి.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు.
ఎంపిక : రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : జులై 21
దరఖాస్తు ఫీజు : రూ. 850. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 175)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: 2023 అక్టోబరులో ఉంటుంది.
వెబ్సైట్: https://www.ibps.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

