న్యూఢిల్లీ: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (FACT)లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 122
ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 3, కెమికల్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 3 (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్), ఫిట్టర్ 24, మెషినిస్ట్ 8, ఎలక్ట్రీషియన్ 15, ప్లంబర్ 4, మెకానిక్ 18, కార్పెంటర్ 2, వెల్డర్ 9, పెయింటర్ 2, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ 12 (ట్రేడ్ అప్రెంటిస్) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి నేషనల్ ట్రేట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 18
వెబ్సైట్: fact.co.in