Cochin Shipyard Limited Recruitment | వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటర్ వెహికల్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర ట్రేడ్‌ల్లో వర్క్‌మ్యాన్ (Worksman) పోస్టుల భర్తీకి కొచ్చిలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష(Online exam), ప్రాక్టికల్ టెస్ట్(Practical Test) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 300
పోస్టులు : వర్క్‌మ్యాన్
విభాగాలు: వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటర్ వెహికల్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.23,300 నుంచి రూ.24,800 వరకు
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 28
వెబ్సైట్ : www.cochinshipyard.com