C-DOT Recruitment 2023 | సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆర్ఎఫ్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత టెలికాం టెక్నాలజీ సెంటర్కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్ (సీడాట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 252
పోస్టులు : సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆర్ఎఫ్ ఇంజినీర్, డెవలప్మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్, హార్డ్వేర్ డిజైన్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000.
ఎంపిక : విద్యార్హతలు, వయస్సు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://cdotrecruitment.cdot.in/