BEL Recruitment 2023 | సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ (Senior Assistant Engineer) పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 50 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్: https://www.bel-india.in/