BEL Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్లైన్ విధానంలో ప్రారంభం కాగా.. మే 18వ తేదీతో ముగియనుంది. మొత్తం 428 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 428
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
జీతం : రూ.30000 నుంచి రూ.55000
వయస్సు : పోస్టులను బట్టి 28 నుంచి 32 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మే 18
వెబ్సైట్: https://www.bel-india.in/
అడ్రస్ : ఔటర్ రింగ్ రోడ్, నాగవర బెంగళూరు: 560045 కర్ణాటక, భారతదేశం.