స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం.. ఏసీబీ వలలో చిక్కిన రాజంపేట ఎస్సై
రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.30 వేలు తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు.
కామారెడ్డి, ఆగస్టు 20: రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.30 వేలు తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కథనం ప్రకారం.. రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో మరింత సహాయం చేయడానికి గాను ఎస్సై ఆంజనేయులు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ సూచన మేరకు బాధితుడు గురువారం కామారెడ్డిలోని ఎస్సై నివాసంలో ఆంజనేయులుకు రూ.30 వేలు అందజేస్తుండగా, అక్కడే మాటు వేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
చిక్కుతున్నా మారని తీరు
ఇటీవలి కాలంలో పోలీసు అధికారులు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నారు. అయి నా వారిలో ఏమాత్రం మా ర్పు రావడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట పోలీసుస్టేషన్లో మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి పోయారు. అయినప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు లేకుండా పోయింది. తాజాగా రాజంపేట ఎస్సై కూడా పట్టుబడ్డారు. అవినీతి అధికారులపై సరైన చర్యలు లేకపోవడంతో వారిలో భయమన్నదే లేకుండా పోయిందన్న అభిప్రాయం నెలకొన్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- Rajampet SI
- station bail
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

