మానవత్వం చాటిన మంత్రి వేముల..
దివ్యాంగుడిని కారులో ఇంటికి పంపించిన మంత్రి

వేల్పూర్ : పెన్షన్ మంజూరు చేయాలని వచ్చిన దివ్యాంగుడి బాధను తెలుసుకుని చలించిన రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్యకు రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఒక కాలును వైద్యులు తొలగించారు. దీంతో అతను ఏ పని చేసుకొలేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. . పెన్షన్ కోసం మండల అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక పోవటంతో సోమవారం తన నివాసం వేల్పూర్‌కు వచ్చిన మంత్రికి తన బాధితుడు తన బాధను వినిపించుకున్నాడు.
దీంతో చలించి పోయిన మంత్రి సంబంధిత అధికారులతో ఫొన్లో మాట్లాడి పెన్షన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాపూర్ నుంచి ఎలా వచ్చావు అని మంత్రి బాధితుడని అడుగగా ఆటోలో వచ్చాను.. చెప్పటంతో మంత్రి తన కారులో ఇంటి వరకు దింపిరావాలని అక్కడే ఉన్న ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములుకు ఆదేశించడంతో బాధితుడిని ఇంటివద్ద వదిలి వచ్చారు. దీంతో బాధితుడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

