ఆపద్బాంధవుడు మంత్రి వేముల
ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు.
- పేదలకు అండగా నిలుస్తున్న ప్రశాంత్‌రెడ్డి
- ‘కిడ్నీ వ్యాధి బాధితుడి’కి రూ.2లక్షల ఎల్వోసీ అందజేత
మోర్తాడ్, మే 29: ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు. అనారోగ్యం బారిన పడి ఆర్థిక స్థోమత లేనివారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) నుంచి కోట్లరూపాయల ఆర్థికసహాయాన్ని అందిస్తూ పేదకుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు.
పార్టీలకు అతీతంగా సాయాన్ని అందిస్తూ ప్రజల గుండెల్లోనిలుస్తున్నారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పరుకుంట గంగాధర్‌కు రూ.2లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి సోమవారం అందజేశారు. గంగాధర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈవిషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వేముల దృష్టికి తీసుకురాగా, నిమ్స్ దవాఖానలో చేర్పించడంతోపాటు రూ.2లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో బాధితుడికి మంత్రి వేముల అందజేశారు. తనకు ఆర్థిక సాయం చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని బాధితుడు గంగాధర్ పేర్కొన్నాడు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

