సీపీ నాగరాజుకు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్ పోలీసు కమిషనర్ కేఈఆర్ నాగరాజు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. 15 నెలల పాటు ఆయన తనదైన శైలిలో పనిచేసి అందరి మన్నన లు పొందారు.
- ఉద్యోగ విరమణ చేసిన పోలీసు కమిషనర్
- 15 నెలల పాటు సేవలు..
- శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక గుర్తింపు
- నిజామాబాద్ ఇన్చార్జి సీపీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్
నిజామాబాద్ క్రైం, మార్చి 31: నిజామాబాద్ పోలీసు కమిషనర్ కేఈఆర్ నాగరాజు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. 15 నెలల పాటు ఆయన తనదైన శైలిలో పనిచేసి అందరి మన్నన లు పొందారు. మంచికి మారుపేరుగా, స్నేహపూర్వకంగా మెలిగిన ఆయన పోలీసు సిబ్బంది మనస్సులో చెరగని ముద్ర వేసుకొన్నారు. ముఖ్యంగా జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మంచి ఆఫీసర్‌గా పేరు గడించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి డీసీపీ వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది తరలివచ్చారు. భావోద్వేగానికి గురై సీపీ నాగరాజుకు వీడ్కోలు పలికారు. పోలీసు సిబ్బంది సీపీతోపాటు కుటుంబ సభ్యులను వాహనం ఎక్కించారు. వాహనాన్ని తాడుతో లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నాగరాజును ఆదర్శంగా తీసుకోవాలి; ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజును ప్రతి పోలీసు అధికారి ఆదర్శంగా తీసుకోవాలని ఐజీ (జోనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కమిషనరేట్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటల్లో సీపీకి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయగా.. ముఖ్యఅతిథిగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. సీపీ నాగరాజును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, జగిత్యాల్, నిర్మల్ ఎస్పీలు డి.ఉదయ్ కుమార్, భాస్కర్, సీహెచ్.ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అదనపు డీసీపీలు, ఏసీపీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
అందరి సహకారంతో పనిచేశా..; నాగరాజు
ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సీపీ నాగరాజుకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా సీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ నాగరాజు మాట్లాడుతూ.. సిబ్బంది సహకారంతో చక్కగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎలాంటి రిమార్కులు లేకుండా సిబ్బంది విధులు నిర్వహించారని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని రకాల బందోబస్తులకు వెళ్లిన సిబ్బంది అక్కడ అధికారుల మన్ననలు పొందారని గుర్తుచేశారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ గిరిరాజు, ఏవో మధుసూదన్‌రావు, ఏఆర్, ఏసీపీలు కిరణ్‌కుమార్, సంతోష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
ఇన్చార్జి సీపీగా ప్రవీణ్‌కుమార్..నిజామాబాద్ ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

