Hanmanth Shinde | పెద్ద కొడప్ గల్, జూలై 3 : ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్ గల్ మండలంలోని BRS మాజీ మండల అధ్యక్షుడు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఇంటింటి ఓటరు గణన విధివిధానాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బీఎల్ఓల (BLOs) సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ ఇంటింటి ఓటరు గణనను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని, ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు విజయ్ దేశాయ్, నాయకులు సతీష్ యాదవ్, సంగప్ప దేశాయ్, గుండె రావు, కండే రావు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.