డిజిటలైజేషన్‌తో సత్ఫలితాలు
కాగితాల నుంచి కంప్యూటర్ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నదని, అందుకనుగుణంగా న్యాయస్థానాల ప్రస్థానం సైతం డిజిటలైజేషన్ దిశగా ప్రయాణం సాగిస్తున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి పేర్కొన్నారు. కోర్టుల్లో న్యాయవివాదాల దావాలు, క్రిమినల్ కేసుల వివరాలను ఇక నుంచి రికార్డుల్లో కాకుండా కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నట్లు పారు.
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి
వినాయక్ నగర్, నవంబర్ 29: కాగితాల నుంచి కంప్యూటర్ వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నదని, అందుకనుగుణంగా న్యాయస్థానాల ప్రస్థానం సైతం డిజిటలైజేషన్ దిశగా ప్రయాణం సాగిస్తున్నదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి పేర్కొన్నారు. కోర్టుల్లో న్యాయవివాదాల దావాలు, క్రిమినల్ కేసుల వివరాలను ఇక నుంచి రికార్డుల్లో కాకుండా కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నట్లు పారు.
నిజామాబాద్ జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ కోర్టు రికార్డుల ప్రాజెక్ట్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి, బార్ బాధ్యులు సాయారెడ్డి, మాణిక్‌రాజు, అదనపు జిల్లా జడ్జిలు హరీశ, శ్రీనివాస్‌లతో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి ప్రసంగించారు. రాజ్యాంగమే పౌరులందరికీ ప్రామాణికం కావాలని, రాజ్యాంగం అందరికీ పవిత్ర గ్రంథమేనన్నారు.
నిరంతర అభ్యసన అవసరం..
కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, జూనియర్ సివిల్ జడ్జిల పోస్ట్‌లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్లుల భర్తీ నిరంతర ప్రక్రియ అని, యువ న్యాయవాదులు నిరంతరం అభ్యసించాలని, ఉద్యోగ అవకాశాల వచ్చినప్పుడు సాధించాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలను చాడాలని, న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే చట్టపరమైన వాదనలు వినాలని, వాటి ద్వారా నేర్చుకోవాలని జస్టిస్ మాధవిదేవి సూచించారు.
భీమ్‌గల్ మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు వచ్చాయని, త్వరలోనే కోర్టు ఏర్పాటవుతుందని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బు ఉపాధ్యాయ, గోపికృష్ణ, హరికుమార్, చైతన్య, శ్రీనివాస్‌రావు, ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్, పీపీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు జడ్జి మాధవీదేవిని బార్ సోసియేషన్ బాధ్యులు సాయరెడ్డి, మాణిక్ రాజు, పీపీ రాజేశ్వర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

