Mortad | మోర్తాడ్ : యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ సొసైటీ పరిధిలోని ఆరు గ్రామాల రైతులు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాప్ విధానం వల్ల యూరియా సరైన సమయానికి అందడం లేదని యాప్ వాడడం తెలియక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయని, కావున యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతీ రైతుకు అవసరం ఉందని యూరియా సంచులను పాత పద్ధతిలో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.