సారు పాలనలో సవ్యంగా కరెంటు
సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపాటు కరెంటు ఉంటుండె.
- సమైక్యపాలనలో కరెంటు బాధలు చూసినం
- స్వరాష్ట్రంలో కేసీఆర్ నాణ్యమైన విద్యుత్ ఇచ్చిండు
సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపాటు కరెంటు ఉంటుండె. కరెంటు ఇచ్చేటప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తొందరగా తీరుతుండె. అంతమంచిగ చేసిండు. అసొంటి సారుపై నిందలు మోపొద్దు. సవ్యమైన కరెంటు ఇచ్చి రంది లేకుండా చేసిండు.. అని ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. కరెంటు సరఫరాపై వారి మనోగతాన్ని వివరించారు.
జిరాక్స్ సెంటర్ను మంచిగా నడిపించిన..
జిరాక్స్ సెంటర్కు కరెంటు తప్పనిసరి. కేసీఆర్ సార్ హయాంలో 24గంటల కరెంటు ఉంటుండె. జిరాక్స్ సెంటర్తోపాటు ఫొటో స్టూడియో ఇప్పటికీ నడుపుతున్నాను. కరెంట్ కోతలు లేకుంటే పని సజావుగా, సులభంగా సాగుతుండె. దీంతో కస్టమర్లకు ఏసమస్య తలెత్తేది కాదు. కస్టమర్లతోపాటు నేనూ సంతోషంగా నడిపేవాన్ని.
– జక్కలి శ్రీకాంత్, జిరాక్స్ సెంటర్, ఎడపల్లి.
కరెంట్ పోయే సమస్యే లేకుండె..
ఎడపల్లి, జూన్ 26: మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కరెంట్ ఫుల్టైమ్ 24గంటలు ఇస్తుండె. కరెంట్ పోయే సమస్యే లేకుండె. మీ సేవ అంటే కరెంట్ మీదనే ఆధారం ఉంటుండె. కేసీఆర్ పాలనలో కరెంటుకు ఏం ఇబ్బంది లేకుండె. నాణ్యమైన కరెంటు వస్తుండె. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా కరెంటును ఇచ్చిండు.
– కేసరి సందీప్, మీ సేవా సెంటర్, ఎడపల్లి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

