Kamareddy | కామారెడ్డి : తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా కార్యవర్గం (2026-28) శుక్రవారం ఎన్నుకున్నారు. స్థానిక వరలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ, కార్యదర్శి రాంనారాయణ, ఎన్నికల అధికారి లస్కర్ సత్యనారాయణ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసింది.
ఈ మేరకు అధ్యక్షుడిగా రజనీకాంత్, కార్యదర్శిగా తోట రాజేష్, కోశాధికారిగా ముదాం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సయ్యద్ కౌనర్అలీ, ఎండీ అబీద్, ముదాం శంకర్ పటేల్ , యు.బాలయ్య, ఎండీ యూనస్, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, సాయిప్రసాద్, కే శ్రీనివాస్ రావు, యూ రామకృష్ణ, లక్ష్మినారాయణ, కార్యవర్గసభ్యులుగా శ్రీకాంత్, ఈ వెంకటేశ్వర్లు, ఇంజమూరి శ్రీనివాస్, కే గంగాధర్, జే బాలప్రకాష్, ఎండీ వాజీద్ అలీ, జీ శ్రీనివాస్, మేకల రవి, భవాని ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పీ శ్రీనివాస్, కార్యదర్శిగా బీ సుధాకర్‌గౌడ్, కోశాధికారిగా జీ సత్య నారాయణగౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంఏ మజీద్, సహాయ కార్యదర్శులుగా రామేశ్వరరావు, ఎన్ సాయిరాం, జే వీరయ్య, రవీందర్ గౌడ్, కార్యవర్గసభ్యులుగా అవునూరి ఆశన్న, ఎండీ రజాక్, పోచయ్య, గంగాధర్, బన్సీలాల్, దినకర్, ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు.