దుబాయ్‌లో ఇండియన్స్‌కు ఎర
దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు.
- బ్యాంకు ఖాతాలకు కమీషన్ ఏజెంట్లు
- కమీషన్లకు కక్కుర్తి పడుతూ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్న వైనం
- పదివేలకు ఆశపడి నిందితులుగా మారుతున్న ఖాతాదారులు
సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు, ఐదో పదికో ఆశపడి బ్యాంకు ఖాతా తెరిచి ఇచ్చే అమాయక ప్రజలు ఇప్పుడు నేరస్తులుగా మారుతున్నారు.
దుబాయ్ అడ్డగా నేడు చైనా సైబర్‌నేరగాళ్లు సైబర్నేరాలను చేయడంలో ఆరితేరిపోయారు. ఇందుకు ఎక్కడికక్కడ కమీషన్ ఏజెంట్లను నియమించుకుంటూ సైబర్దోపిడీ యథేచ్ఛగా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఐదుగురు బ్యాంకు ఖాతాదారులను అరెస్ట్ చేశారు. వీరంతా దుబాయ్‌లో సైబర్‌నేరగాళ్ల ట్రాప్‌లో పడ్డ వారి బంధువులు, చుట్టాలే కావడం గమనార్హం.
ఒకో ఖాతాకు రూ. 10వేలు..
ఉత్తర, ఈశాన్య భారతదేశంలో రూ. 10 వేలకు బ్యాంకు ఖాతాలు కొంటూ వేలాది మంది అమాయకుల వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు సేకరించి నేరాలకు పాల్పడ్డారు. అయితే నెమ్మదిగా దక్షణ భారతదేశంలోను సైబర్‌నేరగాళ్లు తమ నేరాలకు కావాల్సిన బ్యాంకు ఖాతాలను సమకూర్చుకుంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లలో ఏకంగా తమకు బ్యాంకు ఖాతాలు కావాలనే ప్రకటనలు ఇస్తూ కమీషన్ పద్ధతిలో ఈ ముఠా భారీగా మోసాలకు పాల్పడుతున్నది. ఇంతటితో ఆగకుండా ఇప్పుడు విదేశాలల్లో పనిచేసే భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నది.
సైబర్‌నేరగాళ్లు నేరుగా ఎక్కడ కూడా తమ వివరాలు వెల్లడించరు. మధ్యవర్తుల ద్వారానే అన్ని పనులు చేస్తుంటారు. దుబాయ్‌లో పనిచేసే వారితో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తుంటారు. ఒక్కో బ్యాంకు ఖాతాలకు అక్కడ మధ్యవర్తులు ఒక రేటు మాట్లాడుతారు. ఆ మధ్యవర్తులు వచ్చి అక్కడ పనిచేసే భారతీయులను సంప్రదిస్తారు. మీరు, మీ కుటుంబసభ్యులు, తెలిసిన వారి ద్వారా బ్యాం కు ఖాతా తెరిచి తమకు ఇస్తే ఒక్కో ఖాతాకు రూ. 15వేల నుంచి రూ. 20వేలు ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. దుబాయ్‌లో ఉండే వారు భారతదేశంలోని తమ స్వస్థలంలో ఉండే తమ వారికి రూ. 10వేలు ఇచ్చి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు.
ఇలా 2009లో సౌదీకి వెళ్లి సివిల్ వర్క్ పనులు చేస్తున్న డబీర్‌పురాకు చెందిన అరీఫ్ సైఫికి బ్యాంకు ఖాతాలు తెరిపించే యూపీ, పంజాబ్‌కు చెందిన జైయిద్, సందీప్ సింగ్‌లు పరిచయం అయ్యారు. తమకు ఇండియాలో బ్యాంకు ఖాతాలు కావాలని క్రిప్టో కరెన్సీ బిజినెస్‌కు అవసరమని నమ్మించి ఒక్కో ఖాతాకు రూ. 15 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో సైఫీ, షార్జాలో ఉంటున్న చాదర్‌ఘాట్‌కు చెందిన ఫాతిమా బేగంతో మాట్లాడి ఈ విషయంపై చర్చించారు. ఆ తర్వాత ఇద్దరు తమ వారికి రూ. 10 వేలు ఇప్పించి పలువురి వద్ద నుంచి ఇండియాలో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ వివరాలన్ని సైబర్‌నేరగాళ్లకు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు సైబర్‌నేరగాళ్లు రెండు మూడు బృందాలుగా విడిపోయి ఎవరి స్థాయిలో వారు కమీషన్లు మాట్లాడుకుంటూ బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఎవరైనా బ్యాంకు ఖాతాలు తెరువాలని కోరితే అస్సలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతా వివరాలు ఇతరులకు ఇవ్వొద్దని, అలా చేయడం కూడా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

