Pothangal | ఎల్‌నినో పరిస్థితుల్లో రబీ జొన్న సాగు మేలు.. పోతంగల్ ఏవో నిశిత
ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రబీ జొన్న సాగు చేపట్టాలని పోతంగల్ మండల వ్యవసాయ అధికారిణి నిశిత రైతులకు సూచించారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Pothangal | పోతంగల్, అక్టోబర్ 19: ఎల్‌నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రబీ జొన్న సాగు చేపట్టాలని పోతంగల్ మండల వ్యవసాయ అధికారిణి నిశిత రైతులకు సూచించారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. నల్లరేగడి నేలలు జొన్న సాగుకు అనుకూలమని తెలిపారు. డిసెంబరు చివరి వారం వరకు విత్తుకోవచ్చని, తక్కువ కాలపరిమితి కలిగిన రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 3–4 కిలోల విత్తనం అవసరమని, కాండం ఈగ నివారణకు విత్తన శుద్ధి చేయాలని పేర్కొన్నారు.
నత్రజని ఎరువును రెండు దఫాలుగా వేయడంతో పాటు పూత, గింజలో పాలుపట్టే దశల్లో తగినంత నీరు అందించాలని తెలిపారు. నీటి కొరతను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న నీటిని కీలక దశల్లో సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ సాగు చేపట్టడం ద్వారా పంట దిగుబడిని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

