Damaged crop | వర్ని : నష్టపోయిన పంటపొలాలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు మోరిల్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో సుమారుగా 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో పంట పొలాలను పరిశీలించారు.
పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.