Blood cancer | బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదు.. చికిత్సతో నయం చేయవచ్చు.. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్
రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Blood cancer | ఖలీల్ వాడి నిజామాబాద్ 18 : రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం రక్త క్యాన్సర్ దినోత్సవం గా జరుపబడుతుందని, రక్త క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ఇట్టి వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.
ఇట్టి క్యాన్సర్ అత్యంత ఖరీదైన వైద్యం అభివృద్ధి చెందిన దేశాలలో రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని, ఇక్కడ మాత్రం రూ.20 లక్షల లో ఇట్టి వైద్యం పూర్తవుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సంప్రదించగా 2014 నుండి 2017 వరకు చికిత్స అందజేయడంతో బాలుడు అత్యంత మెరుగై క్రీడలలో చదువులో రాణిస్తున్నాడని, 13 సంవత్సరాల సోమేశ్వర్ ఇదే వ్యాధితో బాధపడుతుంటే అతనికి కూడా చికిత్స అందజేసినట్లు చెప్పారు. దీంతో బాలుడు చలాకీగా ఉన్నాడని, వర్ని మండలానికి చెందిన రామారావు 8 సంవత్సరాల నుండి రక్త క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొని సమాజంలో చలాకీగా పని చేసుకుంటున్నారని వివరించారు.
రక్త క్యాన్సర్లు ఒకప్పుడు భయం అనిశ్చితి ని కలిగించాయని కానీ 2025లో ఖచ్చితమైన వైద్యం రోగనిరోధక చికిత్సలు లక్ష్యంగా చేసుకున్న మందులు అధునాత ఎముక మజ్జ బోన్ మారో మార్పిడీ కారణంగా అనేక రకాల రక్త క్యాన్సర్లు రక్త రుగ్మతలలో 90% మించిపోయాయని నేడు రోగులు బతికేవారు కాదని వారు పూర్తిగా సాధారణ ఆరోగ్యకరమైన జీవితాలను ఇట్టి చికిత్స ద్వారా గడుపుతున్నారని అన్నారు.
భారతదేశంలో ప్రతీ 20 సెకండ్లకు ఎవరైనా ఒకరు రక్త క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని, అయినప్పటికీ మన దేశంలో అందుబాటులో ఉన్న ఆధునిక సంరక్షణతో నేడు చాలామంది రోగులలో రక్త క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. ఆరోగ్యం డబ్బు లాంటిదని మనం దానిని కోల్పోయే వరకు దాని విలువ గురించి మనకు నిజమైన ఆలోచన ఉండదని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని ప్రతి క్యాన్సర్ కి చికిత్సలు తప్పకుండా చేయబడతాయని చికిత్సలతో నయమవుతాయని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

