Atrocious | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి
Atrocious | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
ధర్పల్లి: నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సామూహిక లైంగిక దాడికి (Mass sexual assault) గురయ్యారు. ధర్పల్లి ఎస్సై జాడి రామకృష్ణ (SI Ramakrishna) తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నలుగురు యువకులు నిజామాబాద్ పరిసర ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెళ్లెలును పరిచయం చేసుకుని ధనంబండ తండా నల్లగొండ నరసింహస్వామి ఆలయ సమీపానికి తీసుకొచ్చారు.
వారిలో చెల్లెలుకు మద్యం తాగించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అక్క వారిని ప్రతిఘటించి అక్కడి నుంచి పరుగున రోడ్డుమీదకు వచ్చి కేకలు వేసింది. రోడ్డు వెంట వెళ్తున్న స్థానికులు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బాధిత మహిళలు పూర్తిగా కోలుకున్న తరువాత వివరాలు తెలుస్తాయని ఎస్సై వెల్లడించారు. కాగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

